Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

వార్త 1 week ago

CS Sanjay Jaju: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary - CS) గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్‌ జాజు నియామకమయ్యారు. ప్రస్తుత సీఎస్ కే.

రామకృష్ణారావు (K. Ramakrishna Rao) ఈ నెల (జూన్) 30వ తేదీన పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జూన్ 26) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Read also:Beedi workers children scholarship 2026: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర స్కాలర్‌షిప్స్.. ఇలా అప్లై చేసుకోండి

CS Sanjay Jaju: కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్

తెలంగాణ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, గత కొంతకాలంగా కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతల్లో కొనసాగారు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా మూడు రోజుల కిందటే ఆయన కేంద్ర సర్వీసుల డెప్యుటేషన్ నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్ర కేడర్‌కు తిరిగొచ్చారు. తాజాగా ప్రభుత్వం ఆయనకే సీఎస్ పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గుడ్ న్యూస్! తెలంగాణలో 24 డీఈవో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha