TG POLYCET 2026 Results: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG POLYCET-2026) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) ఈ రోజు (మే 23) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ ఎస్‌వీ భవన్‌లో అధికారికంగా రిజల్ట్స్‌ను అనౌన్స్ చేసింది.
మే 13న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
TG POLYCET 2026 Results:ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Step-by-Step):
విద్యార్థులు కింది సాధారణ స్టెప్స్ ఫాలో అయి తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ర్యాంక్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
Telangana Polycet Rank Card Download
1.అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి:
ముందుగా గూగుల్‌లో తెలంగాణ పాలిసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.
2.లింక్‌పై క్లిక్ చేయండి:
హోమ్‌పేజీలో మీకు స్పష్టంగా కనిపించే “TG POLYCET 2026 Results / Rank Card” అనే ఆప్షన్ లేదా లింక్‌పై క్లిక్ చేయాలి.
3.లాగిన్ వివరాలు నమోదు చేయండి:
ఇప్పుడు ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ హాల్‌టికెట్ నంబర్ (Hall Ticket Number) మరియు पुట్టిన తేదీ (Date of Birth) వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి.
4.సబ్మిట్ బటన్ నొక్కండి:
వివరాలన్నీ ఎంటర్ చేశాక కింద ఉన్న ‘Submit’ లేదా ‘View Rank Card’ బటన్‌పై క్లిక్ చేయాలి.
5.ప్రింట్ తీసుకోండి:
మీ ఫలితాలు, స్కోర్ మరియు ర్యాంక్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్తులో కాలేజీ అడ్మిషన్లు, కౌన్సెలింగ్ అవసరాల కోసం ఆ ర్యాంక్ కార్డును Download చేసుకుని ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోండి.
ముఖ్య గమనిక: పాలిసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ (Web Counseling) షెడ్యూల్‌ను అధికారులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావలసిన కులం, ఆదాయం మరియు స్టడీ సర్టిఫికేట్లను విద్యార్థులు ఇప్పుడే సిద్ధం చేసుకోవడం మంచిది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

