Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది - జగన్

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది - జగన్

వార్త 3 weeks ago

Projects : కృష్ణా నది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

పులిచింతల దిగువ భాగంలో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటూ చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ పరిధిలో ‘మహాత్మాగాంధీ’ (కల్వకుర్తి) ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్ హౌస్ నిర్మాణాలు, అలాగే రాజీవ్ (భీమా) ఎత్తిపోతల పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, దీనివల్ల ఏపీ కృష్ణా డెల్టా మరియు పరివాహక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 YS Jagan

రాయలసీమ నీళ్లపై నిర్లక్ష్యం – శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిపై ధ్వజం

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎడాపెడా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందికి నీటిని వదిలేస్తున్నా, చంద్రబాబు నిలదీయలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, సీమ రైతులకు సాగు నీరందించే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితులతో కరవు బారిన పడుతున్న రాయలసీమకు తాగు, సాగు నీటిని తరలించడానికి చంద్రబాబుకు చేతులు రావట్లేదని, ఏపీ ప్రయోజనాలను పక్కనబెట్టి తెలంగాణ పాలకులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha