Telangana Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలోని నూతన పట్టాదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు పెట్టుబడి సహాయం పొందని రైతులతో పాటు, కొత్తగా భూమి కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు 'రైతు భరోసా' పథకం కింద నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
Read Also: KCR ఎందుకు బయటకు రావడం లేదనే ప్రశ్నపై కేటీఆర్ రియాక్షన్
Telangana Rythu Bharosa
దరఖాస్తుకు జూలై 5 ఆఖరి గడువు
ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు (PPB) పొందిన రైతులందరూ ఈ పథకానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు జూలై 5వ తేదీ లోపు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. జూలై 30వ తేదీన వానాకాలం విడతకు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాబట్టి గడువు ముగిసేలోగా కొత్త రైతులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా (వానాకాలం రూ.6,000, యాసంగి రూ.6,000 చొప్పున) నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ (DBT) చేయనున్నారు. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద లేదా మండల వ్యవసాయ అధికారి (MAO) కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి. పట్టాదారు పాస్‌పుస్తకం (PPB) జిరాక్స్ లేదా ఆన్‌లైన్ 1B పత్రం. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్‌తో అనుసంధానమైన (Link) బ్యాంకు ఖాతా పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, చురుగ్గా ఉన్న మొబైల్ నంబర్.

