CM Revanth Reddy : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సభాపతి (స్పీకర్)ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వాడిన భాషపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే చట్టసభల స్పీకర్‌కు ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. అత్యంత అభ్యంతరకరమైన, అసభ్యకరమైన భాషను ఉపయోగించిన ఆ సభ్యుడి చేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
Read Also: Uttam Kumar Reddy: కేసీఆర్ పాదయాత్రపై మంత్రి ఉత్తమ్ విమర్శలు
CM Revanth Reddy
CM Revanth Reddy : పథకం ప్రకారమే స్పీకర్‌పై దాడి
స్పీకర్‌కు జరిగిన అవమానం తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను కేసీఆరే స్వయంగా ఉసిగొలిపి స్పీకర్‌ను అవమానించేలా చేశారని, ఇది అనాలోచితంగా జరిగింది కాదని, పక్కా పథకం ప్రకారమే జరిగిందని సీఎం ఆరోపించారు. స్పీకర్‌ను గాయపరచడం అంటే వైద్యం చేసే వైద్యుడిపైనే దాడి చేయడమేనని అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే శాసనసభలకు ఉండే మర్యాద, గౌరవం నశిస్తాయని హెచ్చరించారు.స్పీకర్‌పై వాడిన అసభ్యకర భాషను ఖండిస్తున్నట్లు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సంబంధిత సభ్యుడిని తక్షణమే బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందిస్తూ.. బీఆర్ఎస్ సభ్యుల తీరు సమాజం తలదించుకునేలా ఉందన్నారు. స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించినందున సదరు సభ్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి స్థానానికి జరిగిన అవమానంపై చర్చించిన తర్వాతే ఇతర అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

