TG TET 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలకమైన అప్‌డేట్ అందించింది. టెట్ ఆన్‌లైన్ పరీక్షల సమగ్ర కాలపట్టికను ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) డైరెక్టర్ మరియు టెట్ కన్వీనర్ అధికారికంగా ప్రకటించారు.
ఈసారి పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) ఆన్‌లైన్ విధానంలో, మొత్తం 5 రోజుల పాటు 10 సెషన్లలో నిర్వహించనున్నారు.
TG TET Online Exams
ఈ పరీక్షలు జూన్ 16, 2026 నుండి ప్రారంభమై జూన్ 22, 2026 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ రెండు విడతల్లో (షిఫ్టుల్లో) పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు, అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లాలు, పేపర్లు మరియు మీడియం ఆధారంగా పరీక్షల తేదీలను కేటాయించారు.
Read also: Sangareddy Crime:భర్త కళ్లెదుటే భార్య గొంతుకోసి దారుణ హత్య!
జూన్ 16 &జూన్ 17 తేదీల పరీక్షల వివరాలు
తొలిరోజు జూన్ 16న మొదటి షిఫ్ట్‌లో పేపర్-1 (తెలుగు/ఇంగ్లీష్ మీడియం) పరీక్ష ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం రెండో షిఫ్ట్‌లో జనగాం, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వారికి పేపర్-1 పరీక్ష ఉంటుంది.
జూన్ 17 బుధవారం ఉదయం షిఫ్ట్‌లో హైదరాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సిరిсиల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి జిల్లాల వారికి పేపర్-1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రెండో షిఫ్ట్ నుండి పేపర్-2 (మ్యాథ్స్ & సైన్స్) పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇందులో ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, నల్గొండ, యాదాద్రి జిల్లాల అభ్యర్థులు పరీక్ష రాస్తారు.
TG TET 2026: జూన్ 18 & జూన్ 19 తేదీల పరీక్షల వివరాలు
జూన్ 18 గురువారం ఉదయం షిఫ్ట్‌లో పేపర్-2 (మ్యాథ్స్ & సైన్స్) పరీక్ష జనగాం, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల వారికి ఉంటుంది. మధ్యాహ్నం సెషన్‌లో హైదరాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అభ్యర్థులకు ఇదే పరీక్ష నిర్వహిస్తారు.
జూన్ 19 శుక్రవారం నుండి పేపర్-2 (సోషల్ స్టడీస్) పరీక్షలు మొదలవుతాయి. ఉదయం పూట ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం షిఫ్ట్‌లో జనగాం, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
జూన్ 22: మైనర్ లాంగ్వేజెస్ పరీక్షల వివరాలు
పరీక్షల చివరి రోజైన జూన్ 22 సోమవారం నాడు మైనర్ లాంగ్వేజ్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం షిఫ్ట్‌లో పేపర్-2 (మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్) కు సంబంధించిన హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం భాషల వారికి అన్ని జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో పేపర్-1 మైనర్ లాంగ్వేజెస్ (హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ) రాసే అన్ని జిల్లాల అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్షతో ఈ షెడ్యూల్ ముగుస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

