TET Hall Tickets : తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న TGTET In-Service Teachers-2026 పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్‌లో హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ వెల్లడించింది.
సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ :
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టెట్ పరీక్షలను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అందుబాటులో ఉన్న తాజా వివరాల ప్రకారం మొత్తం 24,985 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష తేదీ, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రం చిరునామా వంటి కీలక వివరాలు ఉంటాయి. అభ్యర్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అందులోని వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా తప్పు లేదా వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్ ప్రింట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లడం తప్పనిసరి. పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు మరియు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక పోర్టల్‌ను మాత్రమే పరిశీలించాలని సూచించారు.
విజయ్‌ను PM కుర్చీలో రాహుల్ కూర్చోబెడతారు : TVK ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

