Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీపై కీలక ముందడుగు

తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీపై కీలక ముందడుగు

వార్త 3 weeks ago

Employees' PRC : తెలంగాణలో పెండింగ్ కరువు భత్యం (DA) వాయిదాలు, రెండవ వేతన సవరణ కమిషన్ (2nd PRC) ఫిట్‌మెంట్ ఖరారుపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలకు సిద్ధమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఉద్యోగ సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా నివేదికను వేగవంతం చేసేందుకు సీఎస్ సంజయ్ చర్యలు చేపట్టారు. రెండవ పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ కు లేఖ రాసిన సీఎస్, తుది నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేసంలో ఈ విషయాలను పంచుకున్నారు. పీఆర్సీ కమిషన్ నివేదిక అందిన వెంటనే ఉద్యోగుల జీతాల పెంపు, ఫిట్‌మెంట్ శాతంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.

పెండింగ్ డీఏలు, ఆర్థిక అంశాలపై సచివాలయంలో కీలక చర్చలు

పీఆర్సీ ప్రక్రియతో పాటు ఉద్యోగులను వేధిస్తున్న ఇతర ఆర్థిక సమస్యలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న డీఏలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ ముగింపు చెల్లింపులపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ భేటీలో పెండింగ్ బిల్లుల విడుదల క్యాలెండర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సానుకూల వైఖరితో ఉద్యోగ వర్గాల్లో కొంత ఉపశమనం లభించినప్పటికీ, 2వ పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి ఫిట్‌మెంట్ ప్రకటిస్తుందోనని ఉద్యోగులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దేశానికి విముక్తి కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే: రేవంత్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha