New Pensions: తెలంగాణలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని (జూన్ 2) పురస్కరించుకుని 'చేయూత' పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
దీంతో గత మూడేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 42 లక్షల మంది ఆసరా/చేయూత పింఛన్లు పొందుతున్నారు. అయితే గత మూడేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోవడంతో దాదాపు 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మార్చి బడ్జెట్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన 2 లక్షల కొత్త పింఛన్లను జూన్ 2న పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: TG CM: మైనర్ బాలిక ఘటనపై కేసీఆర్ మౌనం ఎందుకు?: సీఎం రేవంత్ రెడ్డి ఘాటు ప్రశ్నలు!
New Pensions
ఫేషియల్ రికగ్నిషన్, గ్రామ సభలతో పారదర్శకత
పింఛన్ల మంజూరులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను జోడించింది.యాప్ ద్వారా వెరిఫికేషన్: ‘ఫేషియల్ రికగ్నిషన్ యాప్’ (Facial Recognition App) ద్వారా లబ్ధిదారుల లైవ్‌నెస్ అథెంటికేషన్‌ను పరిశీలిస్తున్నారు. దీనివల్ల మరణించిన వారు, వలస వెళ్లిన వారి వివరాలు సులభంగా తేలిపోతాయి. సాంకేతిక పరిశీలన తర్వాత గ్రామాల్లో, వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి మృతుల పేర్లను తొలగించేలా తీర్మానాలు చేస్తారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) భావిస్తోంది.
New Pensions: దివ్యాంగులకే ఫస్ట్ ప్రయారిటీ
కొత్త పింఛన్ల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రాధాన్య క్రమాన్ని (Priority Order) నిర్దేశించింది. అత్యవసరంగా ప్రభుత్వ సాయం అవసరమయ్యే దివ్యాంగులకు (Disabled) మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వృద్ధులు, వితంతువులను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య తీరనుండటంతో పేద కుటుంబాలలో సరికొత్త వెలుగులు నిండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అవ్వ – తాతలకు గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న చేయూత పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పింఛన్ల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందిలో ఆశలు చిగురిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

