Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ యువతకు హ్యుందాయ్ తీపి కబురు

తెలంగాణ యువతకు హ్యుందాయ్ తీపి కబురు

వార్త 1 week ago

Hyundai motors india:సంగారెడ్డి జిల్లా ప్రజలకు అదిరిపోయే తీపి కబురు అందింది.హ్యుందాయ్ ఆర్ అండ్ డి సెంటర్ జహీరాబాద్ ప్రాజెక్ట్ త్వరలోనే ఇక్కడ పట్టాలెక్కనుంది.

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ప్రతిపాదనను అధికారికంగా ఖరారు చేసింది. పారిశ్రామిక రంగానికి ఇది అతిపెద్ద వరం కానుంది.

Telangana Job Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

 Hyundai Research Center in Sangareddy district

సచివాలయంలో అనూహ్య కీలక పరిణామం

ఈ బృహత్తర ప్రాజెక్ట్ కోసం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ ఎండీ చాంగ్యో చో సమావేశమయ్యారు. భవిష్యత్ ప్రణాళికలను ప్రత్యక్షంగా వివరించారు. ఈ సెంటర్‌ నిర్మాణం వేగంగా పూర్తి కావడానికి తక్షణ అనుమతులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Hyundai motors india:రూ. 8,528 కోట్లు… 4,276 కొత్త ఉద్యోగాలు

మొత్తంగా రూ. 8,528 కోట్ల అపరిమిత వ్యయంతో ఈ ఆర్‌ అండ్‌ డీ సెంటర్ రాబోతోంది. నేరుగా 4,276 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కార్ల తయారీ ప్లాంట్‌ను కూడా రాష్ట్రంలోనే ప్రారంభించాలని కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

Epaper: epaper.vaartha.com

రైల్వేలో 3,548 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు..చివరి తేదీ ఇదే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha