Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఏ జిల్లాలకు అలర్ట్?

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక.. ఏ జిల్లాలకు అలర్ట్?

వార్త 1 week ago

Rain alert : తెలంగాణలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో భారీ వర్షపాతం

ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తల్లాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

రుతుపవనాల ప్రభావం

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను (Rain alert) తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కదలికల ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha