Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు

వేగంగా కదులుతున్న రుతుపవనాలు..పలు రాష్ట్రాల్లో వర్షాలు

వార్త 1 week ago

IMD On Monsoon : ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త అందించింది. స్వల్ప ఆలస్యంతో నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీనితో దేశంలో అధికారికంగా వర్షాకాలం ప్రారంభం కానుంది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న తేమతో కూడిన గాలులు బలంగా మారుతుండటంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రుతుపవనాల రాకతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే ఆరు నుంచి ఏడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • కేరళ: ఇక్కడ 7 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే కేరళలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
  • తమిళనాడు, కర్ణాటక: ఈ రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Read Also: South Sudan: భారత సైన్యానికి అరుదైన గౌరవం: 550 మందికి పైగా శాంతి పరిరక్షకులకు ఐరాస పతకాలు

 IMD On Monsoon

IMD On Monsoon : ఉత్తరాది, మధ్య భారత్‌లో ఎండల నుండి ఉపశమనం

గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో బెంబేలెత్తిన ఉత్తరాది రాష్ట్రాలకు రుతుపవనాల రాకతో ఉపశమనం లభించనుంది.

  • దిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.
  • మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి మధ్య, తూర్పు భారత రాష్ట్రాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండీ ప్రాథమిక అంచనాల ప్రకారం, తొలుత రుతుపవనాలు మే 26నే కేరళను తాకుతాయని భావించినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల జూన్ 4కు ఆలస్యమైంది. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘ఎల్ నినో’ (El Nino) పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ నెలలో ఎల్ నినో బలహీనంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నాటికి ఇది మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నమ్మకం సడలుతున్న పరీక్షా వ్యవస్థ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha