Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్ష సూచన.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వార్త 1 week ago

Telangana Rain Alert:తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు జోరు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

Telangana Rain Alert:పలు ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైన వానలు

ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వాన దంచికొడుతోంది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండటంతో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది.

Epaper: epaper.vaartha.com

రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు బ్రేక్.. భూసేకరణ నిలిపివేసిన హైకోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha