Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!

వార్త 3 weeks ago

Yellow Alert : తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

ఆగస్టు 25 ఉదయం 8:30 గంటల వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, (Yellow Alert) మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు :

భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ఆగస్టు 25 ఉదయం 8:30 గంటల నుంచి ఆగస్టు 26 ఉదయం 8:30 గంటల వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులకు అవకాశం ఉందని బులెటిన్ పేర్కొంది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే వర్షం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రయాణాలు చేయకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా పొలాల్లో విద్యుత్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా రానున్న రెండు రోజులు తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల్లో పోటీపై సైనా నెహ్వాల్ ఏమన్నారంటే..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha