TG IAS Transfers: తెలంగాణ (Telangana) లో పరిపాలనా యంత్రాంగంలో ప్రభుత్వం మరోసారి భారీ మార్పులు చేసింది. రాష్ట్ర నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామక ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే..
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పలువురు సీనియర్ అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు, మరికొందరికి అదనపు బాధ్యతలను (Full Additional Charge – FAC) అప్పగించింది.
TG IAS Transfers: కీలక బదిలీలు మరియు అదనపు బాధ్యతల వివరాలు

రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమైన శాఖలకు సంబంధించి జరిగిన ప్రధాన నియామకాలు ఇలా ఉన్నాయి:
- శైలజా రామయ్యర్, IAS: ఈ సీనియర్ అధికారిణిని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి (Principal Secretary, Forestry) గా నియమించారు. దీనితో పాటు ఆమెకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా (Principal Secretary, Endowments) అదనపు బాధ్యతలు అప్పగించారు.
- అహ్మద్ నదీమ్, IAS: ఈయనను సాధారణ పరిపాలన – జీఏడీ పొలిటికల్ (GAD Political) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా (Principal Secretary, Minority Welfare) అదనపు బాధ్యతలను కేటాయించారు.
- ఎన్. శ్రీధర్, IAS: ముఖ్యమంత్రి అధికారిక యంత్రాంగంలో అత్యంత కీలకమైన సీఎం ముఖ్య కార్యదర్శి (Principal Secretary to CM) గా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు.
గుడ్ న్యూస్! తెలంగాణలో 24 డీఈవో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

