TG IPS Transfers 2026: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో అత్యంత కీలకమైన మార్పులు చేపట్టింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను (1994 బ్యాచ్) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న ఆమెను ఈ కీలక పదవికి ఎంపిక చేశారు. దీనితో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా ఆమె అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.
Read Also: Siddipet: శనిగరం ఐకెపి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
TG IPS Transfers 2026: ముఖ్యమైన ఐపీఎస్ బదిలీలు మరియు కొత్త నియామకాలు
Devendra Singh Chauhan ను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా నియమిస్తూ అవినీతి నిరోధక చర్యలకు బాధ్యతలు అప్పగించారు.ఇక, 1997 బ్యాచ్ ఐపీఎస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా నియమించారు. ప్రస్తుతం చౌహన్ అదనపు డీజీపీ (పర్సనల్)గా ఉన్నారు. అలాగే, డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఉన్న 2003 బ్యాచ్‌కు చెందిన షాన్‌వాజ్ ఖాసిమ్‌ను మల్టీ జోన్-IIగా ఐజీగా, అలాగే పోలీస్ పర్సనల్ విభాగం ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Telangana IPS Transfers
2004 బ్యాచ్ అధికారి యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుత సీపీ సుధీర్ బాబు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మొహంతి (2005 బ్యాచ్) డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా నియమించారు. అలాగే ఏసీబీ డైరెక్టర్‌గా ఆయన అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ ఐజీ, 2006 బ్యాచ్‌కు చెందిన బి సుమతికి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీపీ 2006 బ్యాచ్ అధికారి కార్తికేయకు ఎస్‌ఐబీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

