Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శనిగరం ఐకెపి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

శనిగరం ఐకెపి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

వార్త 2 months ago

Siddipet: శుక్రవారం సాయంత్రం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో గల ఐకెపి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి వరి ధాన్య కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఇక్కడ లోడ్ చేసిన వరి ధాన్యం శ్రీ లక్ష్మీ రైస్ మిల్- తోటపల్లి కి పంపించామని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు.

రైతులతో మాట్లాడుతూ ధాన్యం గ్రేడ్ విషయంలో సమస్యలు ఉన్నందున పరిష్కరించాలని రైతులు కోరగా అగ్రికల్చర్ అధికారులు వచ్చి ధాన్యం అంత పరిశీలన చేసి గ్రేడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Read Also:Hyderabad Rain Update: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

Siddipet: ధాన్యం గ్రేడింగ్ సమస్యపై స్పందన

సెంటర్ లో తాగునీటి వసతి, కంఠాల, తాలు తీసే యంత్రాలు, గన్ని బ్యాగులు, సుతిల్ దారాలు ప్రతిదీ ఉండేలా చూసుకోవాలని, ధాన్యం తేమ శాతం వచ్చాక తాలు తీసాకే లోడ్ చేయించాలని సిబ్బందికి తెలిపారు.అలాగే రైతులు రాత్రి వేళలో ధాన్యం పైన టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని అకాల వర్షాలు పడే ఆస్కారం ఉందని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విజవంతం అయిన ఘన్ పూర్ పంప్ హౌస్ ట్రయిల్ రన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha