Kunamneni Sambasiva Rao: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ కేవలం మతపరమైన విభజన రాజకీయాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే సిద్ధాంతాలపైనే మనుగడ సాగిస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. తెలంగాణ గడ్డపై జైత్రయాత్రలు, దండయాత్రలు చేస్తామంటూ బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని వారు ఇక్కడ ఒకట్రెండు సీట్లు గెలుచుకోగలరేమో కానీ, అధికార పీఠాన్ని దక్కించుకోవడం మాత్రం ఎప్పటికీ అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రంలోనూ పాలకుల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ తరుణంలో సీపీఐ కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం క్షేత్రస్థాయి పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Telangana CPI Padayatra
రాబోయే ఎన్నికలపై సీపీఐ వ్యూహం.. 40 స్థానాల్లో స్పెషల్ ఫోకస్!
భవిష్యత్తు ఎన్నికల కార్యాచరణను ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఉంటే కనీసం 5 స్థానాల్లో, ఒకవేళ ఒంటరిగా వెళ్లాల్సి వస్తే కనీసం 15 నియోజకవర్గాల్లో సీపీఐ గట్టి పోటీ ఇచ్చేలా క్యాడర్‌ను సిద్ధం కావాలని కూనంనేని దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉన్న 40 నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించామని వెల్లడించారు. ఈ స్థానాల్లో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక పాదయాత్రలు చేపడతామని ప్రకటించారు. ఈ యాత్రల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు క్షేత్రస్థాయిలోని స్థానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని వివరించారు.
read also: Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం
Kunamneni Sambasiva Rao: వరుస పోరాటాలకు పిలుపు: జూన్ 4 నుంచి 'ఛలో ఢిల్లీ' వరకు షెడ్యూల్!
పార్టీ తరఫున చేపట్టబోయే రాబోయే ఉద్యమ కార్యాచరణల షెడ్యూల్‌ను కూడా కూనంనేని సాంబశివరావు ఈ సమావేశంలో విడుదల చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న వేధింపులకు నిరసనగా జూన్ 4న రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ఉంటాయని, అలాగే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 15న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వీటన్నింటితో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సెప్టెంబర్ 28న ప్రతిష్టాత్మక 'ఛలో ఢిల్లీ' (Chalo Delhi) కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు కూనంనేని వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

