Pawan Kalyan Post Viral : హైదరాబాద్‌లో జనసేన నిర్వహించ తలపెట్టిన 'నవనిర్మాణ సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రముఖ కవి శేషేంద్ర శర్మ రాసిన ఒక శక్తివంతమైన కవితను ఆయన పోస్ట్ చేశారు. తెలంగాణలో జనసేన ఉనికి చాటుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ (pawan Kalyan) , తెలంగాణ ప్రజలు తనకు ఎన్నో సందర్భాల్లో అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. “ఆంధ్రప్రదేశ్‌లోనే నేను అధికారాన్ని కోరుకోలేదు.. మరి తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటాను?” అని ఆయన ప్రశ్నించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, కేవలం సమాజంలో మార్పు కోసమే రాజకీయం చేస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Read Also: mangoes : ఫలరాజుల దిగుబడికి 'కాపు' కాసేదెవరు?
Pawan Kalyan Post Viral
Pawan Kalyan Post Viral : బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ? - కాంగ్రెస్ నేతలపై ఫైర్
“హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతావ్? ఇక్కడ నీకేం పని?” అని ప్రశ్నిస్తూ తనను బెదిరిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులకు పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “నన్ను అడగడానికి మీరెవరు? బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ?” అంటూ నిలదీశారు. తాను ఇలాంటి బెదిరింపులకు అస్సలు భయపడేవాడిని కాదని తేల్చిచెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు, ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడినా.. ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్న ఇదే కాంగ్రెస్ నేతలు ఆయన వద్ద ఊడిగం చేశారని పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ తరలింపు.. పాలకులపై విమర్శలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మర్రి చెన్నారెడ్డి చొరవ వల్లే తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తెలుగు ప్రజలందరూ దాదాపు 50 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని పేర్కొన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరని.. రాజకీయాల కోసం పాలకులను తిట్టాలే తప్ప సామాన్య ప్రజలను కాదని హితవు పలికారు. తనపై తొలి కేసు కూడా తెలంగాణలోనే నమోదైందని, భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈసారి వర్షాలు తక్కువా?

