CM Breakfast Scheme: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో 'ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
దీనికి సంబంధించిన విధివిధానాలు మరియు మెనూను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.
Read Also : Traffic Restrictions : వాహనదారులకు అలర్ట్..హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Telangana Chief Minister’s Breakfast Scheme Menu
CM Breakfast Scheme: వారానికి ఆరు రోజులు.. రుచికరమైన మెనూ
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన మెనూను అధికారులు రూపొందించారు.
- సోమవారం: దోసె-చట్నీ లేదా చపాతీ-కూర
- మంగళవారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు
- బుధవారం: రెండు పూరీలు-ఆలూ కుర్మా
- గురువారం: రెండు మిల్లెట్ ఇడ్లీలు-సాంబారు
- శుక్రవారం: మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ
- శనివారం: రెండు బోండాలు-చట్నీ వీటితో పాటు రోజు విడిచి రోజు పాలు, మరియు మిగిలిన మూడు రోజులు రాగిజావ విద్యార్థులకు అందుతాయి.
- ఈ పథకం ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా అల్పాహారం తీసుకోవడానికి ప్రతిరోజూ 45 నిమిషాల సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
ఈ పథకం ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా అల్పాహారం తీసుకోవడానికి ప్రతిరోజూ 45 నిమిషాల సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.
బడ్జెట్ కేటాయింపులు
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకం స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ పథకం కోసం రూ. 540 కోట్లు, పాల సరఫరా కోసం రూ. 180 కోట్లు, ఇంటర్ విద్యార్థుల కోసం అదనంగా రూ. 56 కోట్లు రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నేడు శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

