Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో పెట్టుబడులకు భరోసా.. పూర్తి భద్రత: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులకు భరోసా.. పూర్తి భద్రత: సీఎం రేవంత్ రెడ్డి

వార్త 1 week ago

CM Revanth on Industrial Sector : తెలంగాణను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన సమాఖ్య సదస్సులో పాల్గొన్న ఆయన, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైజింగ్ పాలసీ ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.

Jagtial News: మెట్‌పల్లిలో కొత్త కోడలికి 25 రకాల బతుకమ్మలతో వాయినం

 CM Revanth on Industrial Sector :

CM Revanth on Industrial Sector : పెట్టుబడులకు తెలంగాణ అనుకూల రాష్ట్రం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపనలో అనవసర జాప్యాన్ని తగ్గించి, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంచి విధానాలతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా అమలులో ఉన్న మంచి పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ, అవసరమైన చోట కొత్త సంస్కరణలు తీసుకొస్తామని వివరించారు. పెట్టుబడులు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలు తెలంగాణను తమ వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా ఎంచుకోవాలని ఆయన ఆహ్వానించారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, జాతీయ జీడీపీలో రాష్ట్రం దాదాపు 5 శాతం వాటా అందిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వాటాను మరింత పెంచేందుకు పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ ప్రణాళికలతో పాటు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, యువత భాగస్వామ్యం కూడా అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు కొత్త డిజైన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha