TG TET 2026 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TET) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.
ఈ ప్రకటనతో వేలాది మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది.
Read Also: Inter Results : ఇంటర్ ఫలితాల వేళ తెలంగాణ లో తీవ్ర విషాదం.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య
TET Notification Released in Telangana
TG TET 2026 Notification: జూన్ 15 నుండి పరీక్షలు
విద్యాశాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను ఆన్‌లైన్ (Computer Based Test) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు కీలకమైన వెయిటేజీ ఉండటంతో అభ్యర్థులు ఈ పరీక్షను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
దరఖాస్తు వివరాలు
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ, ఫీజు చెల్లింపు, సిలబస్ వంటి పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. డీఎస్సీ (DSC) రాయాలనుకునే అభ్యర్థులకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈ నోటిఫికేషన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
ఇంటర్ మెమోలో తప్పులున్నాయా? 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని బోర్డు ఆదేశం!

