TG Employees Transfers 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేశారు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.
మూడేళ్లు నిండిన వారికి అవకాశం.. నాలుగేళ్లు ఉంటే తప్పనిసరి!
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఒకే చోట 3 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే, ఒకే ప్రాంతంలో 4 ఏళ్లు పని చేసిన ఉద్యోగులను ప్రభుత్వం తప్పనిసరిగా బదిలీ చేయనుంది. అయితే, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఒక విభాగంలో గరిష్ఠంగా 40 శాతం మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Telangana RTC Strike: ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ.. చర్చలకు JAC నేతలను పిలిచిన యాజమాన్యం!

TG Employees Transfers 2026: ప్రాధాన్యత వర్గాలు ఇవే..
బదిలీల ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూనే కొన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని సర్కార్ నిర్ణయించింది. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలుగా ప్రాధాన్యత. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెసులుబాటు.శారీరక వికలాంగత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యత లభించనుంది.
గత కొంతకాలంగా బదిలీల ఫైల్ పెండింగ్లో ఉండటంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో తెరపడింది. చివరగా 2024లో బదిలీలు జరగగా, మళ్లీ ఇప్పుడు మే నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి సెలవుల సమయంలోనే ఈ ప్రక్రియ ముగియనుండటంతో ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నేటి అర్థరాత్రి నుండి రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు: ఆర్టీసీ జేఏసీ చైర్మన్

