Ground water Level : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురుస్తున్నప్పటికీ భూగర్భ జలమట్టాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, జూన్ మరియు జులై ప్రథమార్థంలో వర్షాలు తగ్గడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
జులై ఆఖరి వారంలో ఉత్తర తెలంగాణలో విస్తారంగా, దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ భూగర్భ జలాలు పైకి రాలేదు. వానాకాలం సీజన్‌లో అత్యంత కీలకమైన జులై నెలలో భూగర్భ జలమట్టంలో స్వల్ప మార్పు మాత్రమే నమోదైంది. జులై మొదటి భాగంతో పోలిస్తే ద్వితీయార్థంలో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం కేవలం 0.18 మీటర్లు మాత్రమే పెరిగింది. ఈ ఏడాది జులైలో భూగర్భ జలమట్టం సగటున 9.48 మీటర్ల లోతులో ఉంది. గతేడాది జులైలో ఇది 8.37 మీటర్లుగా ఉండగా, ఈసారి ఏకంగా 1.11 మీటర్ల లోతుకు పడిపోయింది.
Read Also: LPG Connection : హైదరాబాద్ లో కొత్త LPG కనెక్షన్ తీసుకోవాలంటే చుక్కలే !!
Ground water Level
ఏడేళ్లలో తొలిసారిగా పడిపోయిన జలమట్టం
2020-21 నుంచి ఇప్పటివరకు చూస్తే, ఏడేళ్ల కాలంలో జులై నెలలో భూగర్భ జలమట్టం ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. 2025 జులైతో పోలిస్తే రాష్ట్రంలోని 28 జిల్లాల్లో నీటి మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో -4.22 మీటర్లు, ఆదిలాబాద్‌లో -3.55 మీటర్లు, రాజన్న సిరిసిల్లలో -3.30 మీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలో -2.68 మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో -2.56 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది. రాష్ట్రమంతటా నీటిమట్టం తగ్గుతుండగా కేవలం ఐదు జిల్లాల్లో మాత్రం కొంత సానుకూల మార్పు కనిపిస్తోంది:
Ground water Level : నిపుణుల హెచ్చరికలు – సూచనలు
ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో తాగు, సాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు:ప్రజలంతా నీటి వినియోగంలో జాగ్రత్తలు వహించాలి. రైతులు బిందు సేద్యం (Drip), తుంపర సేద్యం (Sprinkler) పద్ధతులను అవలంబించాలి. ఇంకుడు గుంతలు (Rainwater harvesting pits) తవ్వి వర్షపు నీరు నేలలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి.
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు తెలంగాణ ప్రభుత్వ బంపర్ ఆఫర్

