Telangana Road Accident: దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో రహదారి ప్రమాదాల తీవ్రత నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన వార్షిక గణాంకాలు ఈ భయాందోళనలను నిజం చేస్తున్నాయి.
నివేదిక ప్రకారం, 2023లో రాష్ట్రవ్యాప్తంగా 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 25,986కు చేరుకుంది. అంటే కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రమాదాల రేటు 13.5 శాతం పెరిగింది. దేశవ్యాప్త జాతీయ సగటు వృద్ధి రేటు కేవలం 1.5 శాతంగా ఉంటే, తెలంగాణలో అది అంతకంటే చాలా రెట్లు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం.

Read also:TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్
దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మరణాలు
రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరగడమే కాకుండా, వీటి కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో దాదాపు 7,900 మంది మృతి చెందారు. మరణాల వృద్ధి రేటు (3.7 శాతం) పరంగా చూస్తే దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘోరాలకు ముఖ్య కారణం ‘అతివేగం’ (Over Speeding) అని రవాణా శాఖ నిపుణులు తేల్చారు. కేవలం మితిమీరిన వేగం వల్లే 7,500 కంటే ఎక్కువ ఘోర ప్రమాదాలు జరగ్గా, సుమారు 2,760 మంది బలయ్యారు. వీటితో పాటు హిట్ అండ్ రన్ ఘటనలు, వాహనాలను పక్క నుంచి లేదా వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడం వంటి తప్పులు కూడా వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
Telangana Road Accident: రవాణా శాఖ (RTA) అధికారుల భిన్నమైన వాదన
రాష్ట్రంలో ప్రమాదాల గ్రాఫ్ ఇంతలా పెరగడంపై రవాణా శాఖ అధికారులు సరికొత్త వివరణ ఇస్తున్నారు. గతంలో చిన్నపాటి ప్రమాదాలు జరిగితే వాటిని రికార్డుల్లోకి ఎక్కించేవారు కాదని, కానీ ప్రస్తుతం చిన్న ప్రమాదాన్ని కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటం వల్లే గణాంకాలలో ఈ మార్పు కనిపిస్తోందని వారు వాదిస్తున్నారు. రహదారి భద్రతను పటిష్టం చేయడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. రోడ్ల ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడం మరియు ప్రమాద సమయాల్లో క్షతగాత్రులను రక్షించడానికి ‘గోల్డెన్ అవర్’ లో అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

