Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు

తెలంగాణలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడగింపు

వార్త 2 weeks ago

TG Colleges Summer Holidays Extended: తెలంగాణలోని డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ విశ్వవిద్యాలయాలు పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం, వడగాల్పులు దంచికొడుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. పూర్వపు షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సెలవులను జూన్ మొదటి వారం వరకు పొడిగించారు.

 Osmania University Holidays Extension

విశ్వవిద్యాలయాల వారీగా కొత్త షెడ్యూల్

రాష్ట్రంలోని ప్రముఖ సాంప్రదాయ యూనివర్సిటీల పరిధిలోని అన్ని క్యాంపస్, కాన్‌స్టిట్యుయెంట్, అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. వర్సిటీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలు: ఈ మూడు విశ్వవిద్యాలయాలు జూన్ 6వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. వీటికి ఆదివారం (జూన్ 7) కలిసి రానుండటంతో, కాలేజీలు మళ్లీ జూన్ 8 (సోమవారం) నాడు పునఃప్రారంభం అవుతాయి.

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు: ఈ రెండు వర్సిటీలు జూన్ 5 వరకు మాత్రమే వేసవి సెలవులను పొడిగించాయి. ఇవి తిరిగి జూన్ 6వ తేదీ నుంచే తెరుచుకోనున్నాయి.

Read also: TG TET 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

TG Colleges Summer Holidays Extended: ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు మినహాయింపు లేదు

విద్యార్థులకు మరియు బోధనా సిబ్బందికి (ఫ్యాకల్టీ) సెలవులు పొడిగించినప్పటికీ.. కాలేజీల ప్రిన్సిపాల్స్, పరిపాలనా విధుల్లో (Administrative posts) ఉన్న అధ్యాపకులు మాత్రం యధావిధిగా కాలేజీలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పనులు సజావుగా సాగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీలు తెలిపాయి.

యుజిసి నిబంధనలు & హర్షం

యూజీసీ (UGC) రూల్స్ ప్రకారం డిగ్రీ కాలేజీలకు ఏడాదికి 10 వారాల పాటు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కొలీజియట్ ఎడ్యుకేషన్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కాదరు సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. మొదట మే 1 నుంచి మే 31 వరకే సెలవులు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఎండల తీవ్రత వల్ల తీసుకున్న ఈ పొడిగింపు నిర్ణయం సరైనదని కొనియాడారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

చండీగఢ్ MCh రెటినా ఎంట్రన్స్‌లో డాక్టర్ ఆశిష్‌కి 'ఆల్ ఇండియా టాప్ ర్యాంక్'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha