Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

వార్త 2 months ago

Telangana VAT Amendment Bill: తెలంగాణ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యాల్యూ అదెవ్ టాక్స్ రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్ మొబిలిటీ సవరణ బిల్లు-2026ను శాసన సభలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.

బిల్లుపై సభలో విస్తృత చర్చ జరగగా పాయల్ కంకర్ మాట్లాడుతూ డీజిల్, పెట్రోలైపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేయడంతో కేంద్రం రాష్ట్రాల నుంచి తీసుకొని వెళ్ళిన మొత్తం రాష్ట్రాలకు తిరిగిచెల్లిస్తే వ్యాట్ తగ్గిస్తామని చెప్పారు.

Read Also : Vangalapudi Anitha: ప్రజల సంతృప్తే ప్రభుత్వ లక్ష్యం

 Telangana Assembly approves VAT Amendment Bill

Telangana VAT Amendment Bill: సభలో ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి అమ్మకపు దశలో మాత్రమే పన్ను విధించే నిబంధనను రిలయన్స్, బిపి మొదలిటీ లిమిటెడ్ తమ అంతర్గత లావాదేవీల అనుకూలంగా మార్చుకుంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని సరిదిద్ది, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్ను వాటాను సక్రమంగా రాబట్టేందుకు ఈ నవరణ అనివార్యమైంది. 18 జూన్ 2025న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు జి ఓ ఎం ఎస్ నెంబర్ 73కు బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు. ఈ బిల్లు ప్రధానంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడం, ఇంధన విక్రయాలలో పన్ను లొసుగులను అరికట్టడంగా రూపొంచెందబడిందని అన్నారు.

గణాంకాలు, ఆర్థిక ప్రయోజనాలు

2020 నుంచి రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్న ఎవరు పట్టించుకోలేదని, దీన్ని గుర్తించిన ప్రభుత్వం 2025 లో ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ద్వారా జూలై 2024-25 వ్యాట్ ఆదాయం రూ.220 కోట్లు సగటున 28 కోట్లు, నోటిఫికేషన్ తర్వాత జూలై 20 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 250 కోట్లు సగటున 30 కోట్లు ఆదాయం పనుకూరిందని తెలిపారు. మొత్తంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 47 కోట్లు ఆదాయం సమకూర నుందని వెల్లడించారు. రిలయన్స్ కు సపోర్టు చేయడానికా? నష్టాన్ని నివారిం చడానికా? అనేది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని బిజెపి సభ్యుల విమర్శలను తిప్పికొట్టారు.

కేంద్రంపై నిధుల కేటాయింపులో వివక్ష ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం దారీగా వెన్నులు వసూలు చేస్తోంది. 2018-19 నుంచి 2024-2025 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నులు, జిఎస్బీ రూపంలోరూ.4.60 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించింది. అయితే, కేంద్రం నుంచి రాష్ట్రాన్ని బదలాయింపులు, గ్రాంట్ల రూపంలో తిరిగి పొందింది. కేవలంరూ. 1.36 లక్షల కోట్లు మాత్రమేనని మంత్రి చెప్పాడు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉండటం తో బిజెపి పాలిత రాష్ట్రాల పట్ల ఒక విధంగా, బిజెపి యేతర పాలిత రాష్ట్రాల్లో మరోలా వ్యవహరిస్తోందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నురూపంలో ఆదాయం సమకూర్చి ఉత్తరాధి రాష్ట్రాలకు ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు ఈ నిధులు అత్యధికంగా కేటాయిస్తోందని జూపల్లి ఆరోపించారు..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గిగ్ వర్కర్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha