Telangana Gig Workers Bill: గిగ్ వర్కర్ల హక్కులు, భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గిగ్ వర్కర్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
గిగ్ వర్కర్ల బిల్లును కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత సభ ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు రూ. 50వేల పెనాల్టీ వేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. గిగ్ వర్కర్లతో స్వయంగా మాట్లాడి డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేశామన్నారు. ఈ చట్టంతో కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు.
Read Also : Manda Krishna Madiga: అగ్రకులాలకు లేని ఆంక్షలు దళితులకే ఎందుకు?
Telangana Assembly passes Gig Workers Safety Bill
Telangana Gig Workers Bill: గిగ్ కార్మికులకు సామాజిక భద్రత
గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా సంక్షేమ నిధితోపాటు ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో గిగ్ పర్కర్లకు చట్టబద్ద గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొ చ్చినట్లు చెప్పారు. వర్కర్ల హక్కులు, గౌరవం, జీవనోపా ధిని కాపాడే విధంగా నిబంధనలు రూపొందించామన్నారు. గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిక్ ఐడీ వస్తుందని చెప్పారు. స్విగ్గీ, జొమాటో ఇలా అన్ని కంపెనీలకు ఒకటే ఐడీ ఉంటుందన్నారు. గిగ్ వర్కర్స్ తమ సమస్యలు కమిటీకి చెప్పుకోవచ్చని అన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులతో పాటు ప్లాట్ఫామ్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా.. గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శాసనసభలో మంత్రి వివేక్ వెంకస్వామి గిగ్ వర్కర్స్ బిలును తేవడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోదోయాత్రలో గిగ్ వర్కర్స్ తో సమావేశం నిర్వహిం చారని, లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని. తెలిపారు. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం పొదడంపై హైదరా బాద్ ఇన్చార్జి మంత్రిగా వర్కర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ ఎమ్మెల్యె కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వివిధశాఖల్లో పనిచేస్తు న్నఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగుల విషయంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు.
బిల్లులోని ప్రధాన ముఖ్యాంశాలు
గిగ్ కార్మికుల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు సామాజిక భద్రత, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది. ప్లాట్ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి. అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాం గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్ఫాం స్థాయి కమిటీలు పనిచేసాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

