Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్

తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్

వార్త 3 weeks ago

Janasena Party : తెలంగాణపై తనకు పూర్తి కమిట్‌మెంట్ ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని పేర్కొంటూ, కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధి కోసం తన సొంత సంపాదన నుంచి రూ.30 కోట్లు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

అలాగే తెలంగాణలో వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా తనవంతు సహాయంగా విరాళాలు అందించానని చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు.

బెదిరింపులకు భయపడేది లేదన్న జనసేన అధినేత

కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కల్యాణ్, బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. తనపై రాజకీయంగా మొదటి కేసు నమోదైన ప్రాంతం కూడా తెలంగాణేనని గుర్తుచేస్తూ, గతంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన దాడులను తట్టుకుని నిలబడిన తాము ఇప్పుడు ఎలాంటి బెదిరింపులకైనా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లతో జనసేనను భయపెట్టలేరని స్పష్టం చేశారు.

Read also: Sathupalli Singareni : సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ప్రమాదం

 Janasena Party

కాంగ్రెస్ నేతలకు ఘాటు హెచ్చరిక

ఇటీవల కొందరు కాంగ్రెస్ నాయకులు తనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తన నాలుక కోస్తామని మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి, ఎవరైనా ముందుకు రావచ్చని సవాల్ విసిరారు. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం తనను తెలంగాణ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా, ప్రజల కోసం ముందుండి పోరాడేది జనసేన పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో జనసేనకు ఉన్న అనుబంధం బలంగా కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రాయిలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha