Malti Akhilesh: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి తన అద్భుతమైన ప్రతిభతో అత్యున్నత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికాన్ని జయించి ఏకంగా రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
Read Also: MLA Budda Rajasekhar Reddy: మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే
Student from AP lands high-paying job at a Canadian company.
Malti Akhilesh: టైలరింగ్ చేస్తూ చదివించిన దివ్యాంగ తండ్రి
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అఖిలేశ్ తండ్రి గంగాధరరావు దివ్యాంగుడు (చెవిటి, మూగ). ఆయన టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి కూడా భర్తకు చేదోడువాదోడుగా టైలరింగ్ పనుల్లో సాయం చేసేవారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన అఖిలేశ్, పట్టుదలతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నాడు.
ఆదిత్య యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా
సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలేశ్, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తన ప్రతిభను చాటాడు. కెనడాకు చెందిన ‘క్వాంట్రైస్ టెక్ ఏఐ’ (Quantrice Tech AI) సంస్థ అతడిని ఏఐ ఇంజినీర్‌గా (AI Engineer) ఎంపిక చేసి, రూ.1.06 కోట్ల భారీ వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం (Work From Home) పద్ధతిలో ఉంటుందని, అఖిలేశ్ ఇప్పటికే విధుల్లో చేరాడని విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అఖిలేశ్‌తో పాటు రాజేశ్ అనే మరో విద్యార్థి కూడా ఇదే స్థాయిలో రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం విశేషం. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే ఇటువంటి అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన అఖిలేశ్‌ను పలువురు ప్రముఖులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

