Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాలకు 3.46 లక్షల గ్రామీణ గృహాలను మంజూరు చేసిన కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు 3.46 లక్షల గ్రామీణ గృహాలను మంజూరు చేసిన కేంద్రం

వార్త 2 weeks ago

Rural Houses for Telugu States : గ్రామీణ గృహనిర్మాణ పథకమైన 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్' (PMAY-G) కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం 3,46,544 కొత్త ఇళ్లను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.

మంగళవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి, ఈ కొత్త మంజూరులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 2,25,788 ఇళ్లు మరియు తెలంగాణకు 1,20,756 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో, 2024లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం ఇళ్ల సంఖ్య 5 లక్షలకు చేరింది.

PM Kisan Maandhan Yojana: రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. అర్హతలు ఇవే

 Rural Houses for Telugu States

Rural Houses for Telugu States : 5 కోట్ల ఇళ్లను కేటాయించాలని మోదీ లక్ష్యం

“దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు 5 కోట్ల ఇళ్లను కేటాయించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019-24 మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రానికి కేటాయించిన 1.78 లక్షల ఇళ్లలో కేవలం 42,000 (23%) మాత్రమే పూర్తయ్యాయి,” అని ఆయన పేర్కొన్నారు. 2024లో మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, 2024-29 మధ్య దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్లను కేటాయించాలని ప్రధాని మోదీ నిర్ణయించారని ఆయన తెలిపారు. పేదరికం ఆధారిత సిఫార్సుల మేరకు, 2024 తదుపరి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 74,000 మరియు తెలంగాణకు 79,000 ఇళ్లను కేటాయించారు. గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో, ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అదనపు ఇళ్ల కోసం గతంలోనే విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా తీసుకోలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు జరిపిన తర్వాత మిగిలిన 5-6 లక్షల ఇళ్లలో నుండి తెలుగు రాష్ట్రాలకు కలిపి 3.44 లక్షల ఇళ్లను కేటాయించాలని నిర్ణయించాము. “ఇంత భారీ స్థాయిలో కేటాయింపు జరగడం ఇదే మొదటిసారి. మద్దతు అందించినందుకు ప్రధాన మంత్రి మోదీకి మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ధన్యవాదాలు,” అని పెమ్మసాని పేర్కొన్నారు.

పెట్రోల్ బంకుల్లో MDR ఎంతంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha