Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన

వార్త 4 days ago

Weather updates:తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. గతంలో వచ్చిన వాయుగుండం ప్రభావం తగ్గినా, ఇప్పుడు మళ్ళీ వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.

Read also: Low-Pressure Area: మరో తుఫాన్ ఏర్పడబోతుందా ?

 Weather updates: Rain forecast for Telugu states.

తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.

Weather updates:ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయి. మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే చోట్ల చెట్లు కింద నిలబడవద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు.

Epaper: epaper.vaartha.com

త్వరలో పెరుగునున్న పగటి ఉష్ణోగ్రతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha