Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు డౌన్

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు డౌన్

వార్త 3 weeks ago

Chicken Price Today: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కిలో చికెన్ ధర రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం సుమారు రూ.250కి పడిపోయింది.

దీంతో నాన్‌వెజ్ ప్రియులకు కొంత ఊరట లభిస్తోంది. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గడంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతోంది.

Read Also :PIB: త్వరలో రూ.1,000 నోటు రాబోతోందా? కేంద్రం కీలక క్లారిటీ

హైదరాబాద్, విజయవాడలో చికెన్ ధరలు

తాజా ధరల వివరాల ప్రకారం హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.252గా ఉంది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.266గా నమోదైంది. ఇక విజయవాడలో విత్ స్కిన్ చికెన్ కిలో రూ.236కి లభిస్తోంది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

కోడిగుడ్ల ధరలు కూడా తగ్గాయ్

చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా దిగివచ్చాయి. హైదరాబాద్‌లో డజను కోడిగుడ్ల ధర రూ.84గా ఉండగా, విజయవాడలో రూ.90గా ఉంది. దీంతో చికెన్, గుడ్లు కొనుగోలు చేసే కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట లభిస్తోంది.

Chicken Price Today: మరింత తగ్గే అవకాశం ఉందా?

మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్ తగ్గడం ధరలపై ప్రభావం చూపుతోందని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగి డిమాండ్ మరింత తగ్గితే చికెన్ ధరలు ఇంకా పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే స్థానిక మార్కెట్లు, సరఫరా, డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ఐఫోన్ డ్యుయో డిస్‌ప్లే పగుళ్లపై యాపిల్ స్పందన.. సర్వీస్ సెంటర్లకు కొత్త గైడ్‌లైన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha