Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాలులు

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాలులు

వార్త 2 months ago

Telugu States Weather: ఏప్రిల్ నెల ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, సాయంత్రం 5 గంటల వరకు భానుడు భగభగలాడుతున్నాడు.

పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Read Also: Bomman Sriram Reddy : వైఎస్ఆర్సీపీకి బొమ్మన శ్రీరామ రెడ్డికి కీలక పదవి

 Temperatures to rise in Telugu states.

Telugu States Weather: తెలంగాణలో సెగలు.. 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు 20 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ముందుగానే ముదురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు .

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 41.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నేరడుగొమ్మలో 41.5 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 41.4 డిగ్రీలు, జనగామ జిల్లా పాలకుర్తిలో 41.2 డిగ్రీలు, వరంగల్‌ జిల్లా సంగెంలో 41.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితులు

ఏపీలో వాతావరణం కొంత భిన్నంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగా ఉంటుండగా, సాయంత్రం సమయానికి అకాల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే, రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు పల్నాడు 42.2°C, చిత్తూరు 42.1°C, నంద్యాల 41.9°C, కడప 41.8°C గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి సమయంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని మరియు శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

త్వరితగతిన శ్రీవారి దర్శనమంటూ భారీగా డబ్బులు వసూళ్లు చేసిన వ్యక్తి గుట్టురట్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha