Weather Update: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరణుడు దోబూచులాడుతున్నాడు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నా, చివరకు చిరుజల్లులతోనే సరిపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 3 నుంచి 5 రోజుల వాతావరణ పరిస్థితులపై వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also:Maharashtra heavy rains: మహారాష్ట్రలో భారీ వర్షాలకు 16 మంది మృతి
తెలంగాణ వాతావరణ సూచన – హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. గతంలో తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం (Well-Marked Low Pressure Area) ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తర ప్రదేశ్ వైపుగా కదిలింది. ఈ వాతావరణ వ్యవస్థ తెలంగాణకు చాలా దూరంగా వెళ్లినందున, దీని ప్రభావం రాష్ట్రంపై నేరుగా ఉండదు. అయితే, రుతుపవనాల కదలికల వల్ల రాగల మూడు రోజులు కింది విధంగా వాతావరణం ఉండనుంది:
- వర్ష సూచన (జులై 8 నుంచి జులై 10): తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
- ఈదురు గాలుల అలర్ట్: వర్షాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు (Strong surface winds) వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు వానలు
నైరుతి గాలుల తీవ్రత కారణంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలోనూ మార్పులు వచ్చాయి. ఏపీలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Epaper: epaper.vaartha.com

