Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాన జాడే లేదు.. ఆందోళనలో అన్నదాతలు!

వాన జాడే లేదు.. ఆందోళనలో అన్నదాతలు!

వార్త 2 weeks ago

Telangana weather:తెలంగాణలో వానల్లేక రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోగా, మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది.

ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నా, వాన చినుకు మాత్రం పడటం లేదు. దీంతో సాగు పనులు ఆగిపోయి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read also: Accident : కురవి ప్రధాన రహదారిపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు, విద్యార్థులకు గాయాలు!

 Farmers’ agitation due to lack of rain in Telangana

విత్తనాలు మొలకెత్తక రైతుల్లో కంగారు

పొలాల్లో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు వానలు లేక ఆందోళనలో ఉన్నారు. భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తడం లేదు, మొలకెత్తిన పంటలు కూడా నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పెట్టుబడి పెట్టిన సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని అన్నదాతలు భయపడుతున్నారు. వర్షాధార పంటలు వేసిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

Telangana weather:వర్షాలు కురిసే అవకాశం లేదని

రానున్న వారం పది రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి, రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

నవోదయలో ఉచిత చదువు.. జులై 31 చివరి తేదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha