JIO : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు వినియోగదారులను ఆకట్టుకునేందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలలో మూడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంట్ సేవలను వేర్వేరు ప్యాకేజీలుగా రూపొందించింది. ఇందులో మొదటిగా ‘టీవీ ఓన్లీ ప్యాక్’ను నెలకు కేవలం రూ. 400 లభ్యతతో డిజైన్ చేశారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 1000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లతో పాటు, 12 కంటే ఎక్కువ ప్రముఖ ఓటీటీ (OTT) యాప్‌లు మరియు యూట్యూబ్ యాక్సెస్‌ను సులభంగా పొందవచ్చు. కేవలం డిజిటల్ టీవీ వినోదాన్ని మాత్రమే కోరుకునే వారికి ఈ ప్లాన్ అత్యంత అనుకూలంగా ఉంటుంది.
వైఫై, ఓటీటీ ప్రియుల కోసం ప్రత్యేక ప్యాక్‌లు: అందుబాటు ధరల్లో హైస్పీడ్ సేవలు
ఇంటర్నెట్‌తో పాటు వినోదాన్ని కోరుకునే వారి కోసం ‘వైఫై + టీవీ + ఓటీటీ’ కాంబో ప్యాక్‌లను నెలకు రూ. 555 ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఈ ప్లాన్ ద్వారా 30 Mbps లేదా 100 Mbps వేగంతో కూడిన హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఛానళ్లు మరియు ఓటీటీ యాప్‌ల ప్రయోజనాలు లభిస్తాయి. ఇక కేవలం వేగవంతమైన డేటా మాత్రమే కావాలనుకునే వారి కోసం ‘వైఫై ఓన్లీ ప్యాక్స్’ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి అపరిమిత హైస్పీడ్ వైఫై డేటాను అందిస్తాయి. ఇందులో 30 Mbps స్పీడ్ ప్లాన్ రూ. 450కి మరియు 100 Mbps స్పీడ్ ప్లాన్ రూ. 600కి లభిస్తాయి. ఆంధ్రా, తెలంగాణ యూజర్ల జేబుకు చిల్లు పడకుండా, తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా జియో ఈ నిర్ణయం తీసుకుంది.

