Amazon Great Freedom Sale 2026: ఆగస్టు 7 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ తన వార్షిక 'గ్రేట్ ఫ్రీడమ్ సేల్' ను ప్రారంభించనుంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌తో పాటు స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లను ప్రకటించారు.
ముఖ్యంగా వన్ ప్లస్ (OnePlus) బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ సేల్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా నిలవనుంది.
Read Also: Kia Sorento New Teaser: అదిరిపోయే లుక్స్.. పనోరమిక్ సన్‌రూఫ్‌తో రానున్న కియా కొత్త SUV!
Huge discounts on OnePlus phones!
Amazon Great Freedom Sale 2026: వన్ ప్లస్ 13Sపై రూ.10,000 తగ్గింపు
ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్ వన్ ప్లస్ 13S స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉంది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధరపై రూ.10,000 వరకు ప్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలుపుకుని ఈ శక్తివంతమైన ఫోన్ కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే లభించనుంది.
బడ్జెట్ అండ్ మిడ్-రేంజ్ వన్ ప్లస్ మోడళ్లు
కేవలం ప్రీమియం సిరీస్ మాత్రమే కాకుండా, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బడ్జెట్, మిడ్-రేంజ్ సిరీస్‌లపై కూడా అమేజాన్ ప్రత్యేక ధరలను ప్రకటించింది:
- వన్ ప్లస్ నార్డ్ CE6 లైట్ 5G: అత్యుత్తమ బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ ఆఫర్లలో భాగంగా రూ.18,999 కే లభించనుంది.
- వన్ ప్లస్ N6x 5G: రోజువారీ వినియోగానికి ఎంతో అనువుగా ఉండే ఈ 5G మోడల్‌ను రూ.17,499 ప్రత్యేక ధరకు కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో కొనుగోలు చేసే క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులకు అదనపు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. దీనికి తోడు పాత ఫోన్లను ఇచ్చి కొత్త ఫోన్ కొనుగోలు చేసే వారికి మెరుగైన ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ, నో-కాస్ట్ ఈఎంఐ (No-Cost EMI) వెసులుబాటును అమేజాన్ కల్పిస్తోంది. నూతనంగా లాంచ్ కాబోతున్న వన్ ప్లస్ 15R మోడల్ వరకు వివిధ శ్రేణి ఫోన్లను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ సేల్ సరైన వేదిక.
Epaper: epaper.vaartha.com

