Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Terror Threat: వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

Terror Threat: వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వార్త 4 months ago

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పేల్చేందుకు కుట్ర(Terror Threat) జరుగుతోందని పేర్కొంటూ ఓ అజ్ఞాత వ్యక్తి రైల్వే అధికారులకు లేఖ పంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ లేఖలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నలుగురు తీవ్రవాదులు దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించాడు.

భారీ ప్రాణనష్టం లక్ష్యంగా కుట్ర ఆరోపణలు

లేఖలో దాదాపు 250 మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు పేర్కొనడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లలో(Terror Threat) భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ హెచ్చరిక నేపథ్యంలో రైల్వే పోలీసులు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. స్టేషన్లలో ప్రయాణికుల లగేజ్ తనిఖీలు, రైళ్లలో అదనపు భద్రతా సిబ్బంది నియామకం, సీసీటీవీ మానిటరింగ్ పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. లేఖ పంపిన వ్యక్తి వివరాలు, సమాచారం నిజమా కాదా అన్న అంశాలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సైబర్ ట్రేసింగ్ సహాయంతో లేఖ మూలాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులను గమనిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. భయపడాల్సిన అవసరం లేదని, భద్రతకు పూర్తి చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha