Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ విద్యలో కీలక మార్పు.. ఎంఈసీ స్థానంలో కొత్త కోర్సు

ఇంటర్ విద్యలో కీలక మార్పు.. ఎంఈసీ స్థానంలో కొత్త కోర్సు

వార్త 6 months ago

TG Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.

గణితం కష్టంగా భావించే విద్యార్థుల కోసం ఎంఈసీ గ్రూపును తొలగించి, దాని స్థానంలో ఏసీఈ (Accounts, Commerce, Economics) అనే సరికొత్త కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జూన్ నుండి ప్రారంభం కానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు అందుబాటులోకి రానుంది.

ఎంఈసీ స్థానంలో ఏసీఈ.. ఎందుకీ మార్పు?

ప్రస్తుతం ఉన్న ఎంఈసీ గ్రూపులో గణితం ఒక ప్రధాన సబ్జెక్టుగా ఉంది. అయితే, కామర్స్ ఎకనామిక్స్ రంగాల్లో రాణించాలనుకునే చాలా మంది విద్యార్థులకు గణితం ఒక సవాల్‌గా మారుతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు, గణితం, సైన్స్‌తో సంబంధం లేకుండా కేవలం అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో ఈ కొత్త ‘ఏసీఈ’ గ్రూపును రూపొందించింది. ఇది విద్యార్థులకు సులభంగా ఉండటమే కాకుండా, త్వరగా ఉపాధి పొందేలా డిజైన్ చేయబడింది.

Read Also: Telangana RTC Strike: ఆర్టీసీ సమ్మెపై ఉత్కంఠ.. చర్చలకు JAC నేతలను పిలిచిన యాజమాన్యం!

TG Inter Board: విస్తృత అవకాశాలు

ఏసీఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు, డిగ్రీలో బీకాం, బీఏ వంటి కోర్సుల్లో నేరుగా చేరవచ్చు. ప్రతిష్టాత్మక కోర్సులు చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) వంటి కోర్సులకు ఇది బలమైన పునాదిగా మారుతుంది. ఉపాధి రంగం బ్యాంకింగ్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో త్వరగా స్థిరపడవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ గ్రూపు విద్యార్థులు అర్హులు.

ప్రభుత్వ కాలేజీల్లో ఏర్పాట్లు పూర్తి

ఈ నూతన విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, గురుకులాల్లో ఏసీఈ కోర్సును అందుబాటులోకి తెస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 163 ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోనూ ఈ కోర్సు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు యథావిధిగా రెండో సంవత్సరం పూర్తి చేస్తారు, కానీ కొత్తగా చేరే వారికి మాత్రం ఏసీఈ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha