Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGSRTC ఎండీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

TGSRTC ఎండీ నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

వార్త 2 weeks ago

TGSRTC MD Y Nagireddy:తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వై. నాగిరెడ్డి మంగళవారం వరంగల్, హనుమకొండ ప్రధాన బస్‌స్టేషన్లతో పాటు హనుమకొండ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రయాణికులకు అందుతున్న రవాణా సేవలు, డిపోల పనితీరు, నిర్వహణ మరియు బస్టాండ్లలో మౌలిక సదుపాయాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు

ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ ‘PM eBus Sewa’ పథకం కింద త్వరలోనే మరో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (e-Buses) అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 112 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని, కొత్త బస్సుల రాకతో కాలుష్య రహిత సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.

పరిశుభ్రత, మహిళల భద్రతపై కఠిన ఆదేశాలు

బస్టాండ్లలో పరిశుభ్రత, ప్రయాణికులకు సురక్షితమైన తాగునీటి సదుపాయం, మహిళా ప్రయాణికుల భద్రత, వెయిటింగ్ హాళ్ల నిర్వహణ మరియు బస్సుల వేళలు (సమయపాలన) పాటించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బస్సు రూట్లు, ఆక్యుపెన్సీ రేషియో (OR) మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

TGSRTC MD Y Nagireddy: రోజుకు 60 లక్షల మందికి రవాణా

ఆర్టీసీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సురక్షితమైన, నాణ్యమైన ప్రయాణాన్ని అందించడమే సంస్థ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రయాణికుల సేవల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 9 వేలకు పైగా బస్సుల ద్వారా దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ పర్యటనలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్, చీఫ్ సివిల్ ఇంజినీర్ కవిత, వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీ ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్‌లో హెచ్‌-ఫాస్ట్‌ భారీ సోదాలు: భారీ కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha