Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ

Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ

వార్త 4 months ago

తెలుగు (Tollywood) చిత్రసీమలో ఫేమస్ జంటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో చారిత్రక చారిత్రక ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది.

ఈ సందర్భంగా విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్‌కి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

Mrunal Thakur marriage : మృణాల్ పెళ్లి ఎప్పుడు? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్ లో రిసెప్షన్

పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో.. విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరు.. చివరకు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఉదయ్ పూర్ లో వివాహానంతరం ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha