Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
థియేటర్లలో సీటు వద్దకే ఆహారం.. స్విగ్గీ కొత్త సేవలు

థియేటర్లలో సీటు వద్దకే ఆహారం.. స్విగ్గీ కొత్త సేవలు

వార్త 3 weeks ago

Swiggy Order-In-Cinemas: సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు స్విగ్గీ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇంటర్వెల్ సమయంలో పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.

ప్రేక్షకులు తమ సీట్లోనే ఉండి ఫుడ్‌, పానీయాలను ఆర్డర్‌ చేసుకుంటే నేరుగా సీటు వద్దకే డెలివరీ చేసే సౌకర్యాన్ని స్విగ్గీ డైన్‌అవుట్‌ ద్వారా అందిస్తోంది.

సినీపోలిస్‌, ఏషియన్‌ సినిమాస్‌ సహా దేశంలోని పలు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థల భాగస్వామ్యంతో స్విగ్గీ ఈ 'ఆర్డర్‌-ఇన్‌-సినిమాస్' ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రేక్షకులు థియేటర్ హాల్‌ నుంచే నేరుగా ఫుడ్‌, డ్రింక్స్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఫీచర్ ద్వారా ఆర్డర్ చేసే కొన్ని ఆహార పదార్థాలపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి.

Read Also : Apple Cleaning Cloth : యాపిల్ నుంచి 'క్లీనింగ్ క్లాత్' .. ధర ఎంతంటే?

 Food delivered right to your seat in theaters… Swiggy’s new services.

Swiggy Order-In-Cinemas: ఆర్డర్ చేయడం చాలా సులభం

ఈ సేవను ఉపయోగించడం ఎంతో సులభం. థియేటర్‌ హాల్ లేదా సీట్ల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ (QR) కోడ్‌ను స్కాన్‌ చేయగానే, స్విగ్గీ డైన్‌అవుట్‌ యాప్‌లో ఆ థియేటర్‌కి సంబంధించిన ప్రత్యేక మెనూ కనిపిస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన ఆహారం, పానీయాలను ఎంచుకుని డిజిటల్‌ విధానంలో చెల్లింపు పూర్తి చేయాలి. ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే థియేటర్ సిబ్బంది ఆర్డర్‌ను నేరుగా మీ సీటు వద్దకే తీసుకొచ్చి అందిస్తారు.

ఈ యాప్ కేవలం ఫుడ్‌ ఆర్డర్‌కే పరిమితం కాకుండా చలనచిత్ర ప్రియుల కోసం మరిన్ని ఫీచర్లను అందిస్తోంది. కొత్త సినిమాల వివరాలు, ట్రైలర్లు, పోస్టర్లు, బుకింగ్‌ లింకులు, ప్రత్యేక ప్రదర్శనల సమాచారం, ఈవెంట్లు, వివిధ ప్రమోషనల్‌ ఆఫర్లను కూడా ప్రేక్షకులు యాప్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

థియేటర్ నిర్వాహకులకు పెరగనున్న ఆదాయం

ఈ నూతన సేవ ద్వారా థియేటర్‌ నిర్వాహకులకు కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సీటు నుంచే ఆర్డర్‌ చేసే వెసులుబాటు ఉండటంతో ఒక్కో ప్రేక్షకుడి సగటు ఖర్చు పెరిగే అవకాశం ఉందని స్విగ్గీ ప్రతినిధులు తెలిపారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఫుడ్‌ కాంబోలు, అదనపు ఐటెమ్స్‌ను సూచించడం ద్వారా విక్రయాలను మరింత పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

సినిమా చూసేటప్పుడు ఫుడ్‌ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ప్రేక్షకుల సినిమా అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్విగ్గీ డైన్‌అవుట్‌, సీన్స్‌ సీఈఓ స్వప్నిల్‌ బాజ్‌పాయ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

యూపీఐకి పదేళ్లు..మోదీకి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha