Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
థియేటర్లలోకి వచ్చేసిన అజయ్ దేవగన్ 'ధమాల్ 4'.. తొలిరోజు కలెక్షన్ల అంచనా ఇదే!

థియేటర్లలోకి వచ్చేసిన అజయ్ దేవగన్ 'ధమాల్ 4'.. తొలిరోజు కలెక్షన్ల అంచనా ఇదే!

వార్త 0 months ago

Dhamaal 4: బాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన 'ధమాల్' సిరీస్ నుండి నాలుగో భాగం సిద్ధమైంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో, ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ధమాల్ 4' (Dhamaal 4) ఈరోజే (శుక్రవారం, జులై 10) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also:I Nobody Movie Review: ఐ నోబడీ మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ కథతో పృథ్వీరాజ్ అదరగొట్టారా?

తొలిరోజు రూ.15 కోట్ల కలెక్షన్ల టార్గెట్

బాక్స్ ఆఫీస్ ట్రేడ్ అంచనాల ప్రకారం.. ‘ధమాల్ 4’ సినిమా భారతదేశంలో మొదటి రోజు రూ.12 కోట్ల నుండి రూ.14 కోట్ల నెట్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. టాక్ పాజిటివ్‌గా ఉండి, సాయంత్రం, రాత్రి షోలకు థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగితే తొలిరోజు కలెక్షన్లు సులువుగా రూ.15 కోట్ల మార్కును దాటే ఛాన్స్ ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్, త్వరలో రాబోతున్న అక్షయ్ కుమార్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వెల్కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) రేంజ్‌లో ఉండటం విశేషం. అయితే, ఈ చిత్రానికి ఎలాంటి పెయిడ్ ప్రివ్యూలు (Paid Previews) వేయకపోవడంతో, థియేటర్లలో లభించే మౌత్ టాక్ (Word of Mouth) ఆధారంగానే కలెక్షన్ల జోరు మారనుంది.

నో కట్స్.. U/A సర్టిఫికెట్‌తో రన్‌టైమ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A 13+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా మొత్తం నిడివి 143 నిమిషాలు (2 గంటల 23 నిమిషాలు) ఉంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాలో ఎలాంటి సీన్ కట్స్ చెప్పకపోవడం విశేషం. కేవలం రెండు అభ్యంతరకర హావభావాలను (Hand gestures), ఏడు అసభ్య పదాలను రీప్లేస్ చేయాలని మాత్రమే సిఫార్సు చేసింది. నిజానికి ఈ సినిమా జులై 3నే విడుదల కావాల్సి ఉంది. అదే రోజున ‘వెల్కమ్ టు ది జంగిల్’ కూడా షెడ్యూల్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ క్లాష్‌ను నివారించేందుకు ‘ధమాల్ 4’ మేకర్స్ తమ విడుదలను జులై 10కి వాయిదా వేసుకున్నారు.

Dhamaal 4: భారీ తారాగణం.. 'ధమాల్' సక్సెస్ జర్నీ

దర్శకుడు ఇంద్ర కుమార్ ఈ సీక్వెల్‌లో భారీ తారాగణాన్ని దించారు. అజయ్ దేవగన్‌తో పాటు రితీష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, జావేద్ జాఫెరీ, సంజయ్ మిశ్రా, ఈషా గుప్తా, సంజీదా షేక్, అంజలి ఆనంద్, రవి కిషన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2007లో సంజయ్ దత్, రితీష్, అర్షద్‌లతో వచ్చిన మొదటి ‘ధమాల్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ‘ధమాల్ 4’ థియేటర్లలో నవ్వుల పండగ తెచ్చేందుకు సిద్ధమైంది.

Epaper: epaper.vaartha.com

లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha