IND-W vs SA-W: భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నేడు కీలకమైన సమరానికి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా జరగనున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read Also:Quinton de kock : IPLలో అరుదైన రికార్డు సృష్టించిన స్టార్ బ్యాటర్
మహిళల క్రికెట్‌లో మరో ఉత్కంఠభరిత పోరుకు సమయం ఆసన్నమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు, లారా వోల్వార్డ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో నేడు తలపడనుంది. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టు కూర్పును సరిచూసుకోవడానికి ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది.
యువ రక్తం.. కొత్త ఆశలు
ఈ సిరీస్‌లో అందరి కళ్ళు 22 ఏళ్ల ఆల్‌రౌండర్ అనుష్క శర్మపైనే ఉన్నాయి.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మరియు దేశవాళీ క్రికెట్‌లో ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేసిన అనుష్క, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని చూస్తోంది.దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు సహజంగానే పేసర్లకు అనుకూలిస్తాయి. అయితే, ఆఫ్ స్పిన్నర్‌గా అనుష్క తన వైవిధ్యాన్ని ఎలా ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరం.
IND-W vs SA-W
దక్షిణాఫ్రికా vs భారత్ మహిళల టీ20 2026 షెడ్యూల్
అన్నీ భారతీయ ప్రామాణిక కాలమానంలో (IST)
- ఏప్రిల్ 17, శుక్రవారం : దక్షిణాఫ్రికా-పశ్చిమ ఆస్ట్రేలియా vs భారత్-పశ్చిమ ఆస్ట్రేలియా మొదటి టీ20 – రాత్రి 9:30 గంటలకు
- ఏప్రిల్ 19, ఆదివారం : దక్షిణాఫ్రికా-పశ్చిమ ఆస్ట్రేలియా vs భారత్-పశ్చిమ ఆస్ట్రేలియా 2వ టీ20 – సాయంత్రం 5:30 గంటలకు
- ఏప్రిల్ 22, బుధవారం : SA-W vs IND-W 3వ T20 – రాత్రి 9:30 గంటలకు
- ఏప్రిల్ 25, శనివారం : SA-W vs IND-W 4వ T20 – రాత్రి 9:30 గంటలకు
- ఏప్రిల్ 27, సోమవారం : దక్షిణాఫ్రికా-పశ్చిమ ఆస్ట్రేలియా vs భారత్-పశ్చిమ ఆస్ట్రేలియా 5వ టీ20 – సాయంత్రం 5:30 గంటలకు
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కష్వీ గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనుష్క శర్మ.
IND-W vs SA-W: మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి
ఈ మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. సౌతాఫ్రికా దేశంలో సూపర్ స్టోర్ట్స్ క్రికెట్ ఛానెల్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. సూపర్ స్టోర్ట్స్ క్రికెట్ వైబ్‌సైట్, యాప్‌లలో చూడొచ్చు. ఇక భారతదేశంలో ఈ సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కలిగి ఉంది. దీంతో టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
మళ్ళీ అల్గారిథమ్ మహిమేనా? ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోకు కోహ్లీ లైక్

