Telangana Rakshana Sena: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సరికొత్త కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ జెండా గద్దె నమూనాను (మోడల్) అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధినాయకత్వం ప్రకటించింది.
Read Also :First bullet train: 2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్!
Telangana Rakshana Sena: నెల రోజుల పాటు ఉత్సవాలు

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు నెల రోజుల పాటు 'టీఆర్ఎస్ జెండా పండుగ'ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
- గ్రామ స్థాయి నుండి ఉత్సవాలు: ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామ, మండల, పట్టణ కేంద్రాలలో పార్టీ జెండాలను ఎగురవేసి, జెండా పండుగను ఒక ఉత్సవంలా జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు: జెండా పండుగ కార్యక్రమాల ద్వారా పార్టీ ఆశయాలను, ప్రజల రక్షణే ధ్యేయంగా సాగుతున్న పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ఈ సరికొత్త నిరంతర కార్యక్రమంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు రడీ చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

