Chintakayala Vijay: తెలుగుదేశం పార్టీలో కష్టపడే యువతకు, పార్టీ పట్ల విధేయతతో ఉండే నాయకులకు ఎల్లప్పుడూ సముచిత స్థానం ఉంటుందని అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత చింతకాయల విజయ్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు సరికొత్త జోష్ ఇచ్చారు. కేవలం పదవుల పెంపకం మాత్రమే కాకుండా.. పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు వెన్నంటి నడిచిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనే బలమైన సందేశాన్ని చంద్రబాబు పంపారు.
TDP Rajya Sabha Candidate
2019 నుంచి 2024 వరకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనేక రాజకీయ కేసులు, ఇబ్బందులు ఎదురైనా లొంగిపోకుండా, పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించినందుకే విజయ్‌కు ఈ అత్యున్నత గౌరవం దక్కిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read also: AP JAC Amaravati: డిమాండ్లు తీర్చకుంటే పోరాటమే.. కూటమి ప్రభుత్వంపై ఏపీజేఏసీ సంఘాల హెచ్చరిక
ఉన్నత విద్య నుంచి ప్రజాక్షేత్రం వరకు..
టీడీపీలో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, నేడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు చింతకాయల విజయ్. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయడమే కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ వ్యూహాలకు జోడించడంలో ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. చంద్రబాబు, నారా లోకేష్ మార్గదర్శకత్వంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎదుగుతున్నారు.
Chintakayala Vijay: ప్రపంచస్థాయి విద్యా పరిజ్ఞానం:
రాజకీయాల్లో రాణించడానికి ఉన్నత చదువులు ఎంతో అవసరమని నమ్మిన విజయ్.. జేఎన్‌టీయూ (JNTU) నుంచి ఈసీఈలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ‘మాస్టర్స్ ఇన్ పొలిటికల్ గవర్నెన్స్’, అమెరికాలోని ప్రసిద్ధ జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్స్ ఇన్ పొలిటికల్ మేనేజ్‌మెంట్’ పట్టాలు అందుకున్నారు. అమెరికా వైట్ హౌస్‌లో పాలసీ మేకింగ్‌పై ఇంటర్న్‌షిప్ చేయడం ఆయన దార్శనికతకు ఒక నిదర్శనం.
పాదయాత్రల నుంచి డిజిటల్ ఆర్మీ వరకు:
2009లో ‘యూత్ ఫర్ బాబు’ పాదయాత్రతో విజయ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో చంద్రబాబు ‘మీ కోసం పాదయాత్ర’, 2019 తర్వాత లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రల్లో యువతను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కరవు ప్రాంతాల రైతుల కోసం ఏకంగా 250 కిలోమీటర్ల మేర పాదయాత్రను లీడ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, ఆస్తుల ధ్వంసం వంటి చర్యలు ఎదురైనా బెదరకుండా.. టీడీపీ తరఫున ఒక బలమైన ‘సోషల్ మీడియా ఆర్మీ’ని నిర్మించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. నర్సీపట్నంలో 10 వేల మందితో ఆయన నిర్వహించిన ‘మేలుకో మహిళా’ కార్యక్రమం పార్టీ విజయానికి గట్టి పునాది వేసింది.
సేవా రంగంలోనూ అగ్రగామి:
సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, విజయ్ తన స్వయంకృషితో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాలతో పాటు ‘అన్నపూర్ణ అక్షయపాత్ర ఫౌండేషన్’ ద్వారా లక్షలాది మందికి ఆకలి తీర్చారు. ‘డయాగ్నోస్టిక్స్ ఆన్ వీల్స్’ పేరిట గ్రామాల్లో ఉచిత వైద్య పరీక్షలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. గిరిజన ప్రాంత గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో ‘సోలార్ ట్రీ’ ప్రాజెక్టును ఏర్పాటు చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. చంద్రబాబు, లోకేష్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పెద్దల సభలో రాష్ట్ర సమస్యలపై గళం విప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విజయ్ స్పష్టం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

