Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎంసీలో భారీ సంక్షోభం: ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామా

టీఎంసీలో భారీ సంక్షోభం: ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామా

వార్త 3 days ago

శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమనడంతో వరుస రాజీనామాల పరంపర కొనసాగుతోంది.

తాజాగా టీఎంసీకి చెందిన మరో కీలక నేత ప్రకాశ్ చిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. టీఎంసీకి కేవలం ఒకే వారంలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు షాక్ ఇచ్చారు.సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. మహిళా నేత సుష్మితా దేవ్ తన పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రకాశ్ చిక్ కూడా వీరి బాటలోనే పయనిస్తూ రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన వెంటనే సుష్మితా దేవ్.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆమె త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read Also: Madhya Pradesh Govt Sensational Decision : జనాభా పెరుగుదల కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 TMC MP Prakash Baraik Resign

TMC MP Prakash Baraik Resign : లోక్‌సభ ఎంపీల తిరుగుబాటు.. యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా కూడా?

రాజ్యసభలోనే కాకుండా లోక్‌సభలోనూ మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టీఎంసీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ తిరుగుబాటు గ్రూపులో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి సయోనీ ఘోష్, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉనికి చాటుకునేందుకు మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌ను.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అయిన మరుసటి రోజే.. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha