Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజర్, ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి ప్రభాస్ 'ఫౌజీ'?

టీజర్, ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి ప్రభాస్ 'ఫౌజీ'?

వార్త 2 weeks ago

Prabhas Fauji Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆయన నటించిన 'రాజాసాబ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

ప్రస్తుతం ఆయన స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. సాధారణంగా ప్రభాస్ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ లేదా ట్రైలర్ వస్తే సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో ట్రెండ్ అవుతుంటుంది. అయితే ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

Read Also : The Paradise Teaser: నాని 'ది ప్యారడైజ్' టీజర్ అప్‌డేట్ వచ్చేసింది!

 Will Prabhas’s ‘Fauji’ hit theaters without a teaser or trailer?

Prabhas Fauji Movie: ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ లేకుండానే థియేటర్లలోకి!

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూ. 700 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ మూవీకి సంబంధించి ఎలాంటి టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోకే తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పద్ధతిలో రిలీజ్ కానున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భారీ తారాగణం.. విడుదల తేదీ ఇదే

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా ఇమాన్వీ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల కానుండగా, డిసెంబర్ 2న ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరొక మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘స్పిరిట్’ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మార్చి 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha