Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీజీ పీజీఈసీఈటీ ఫలితాలు విడుదల

టీజీ పీజీఈసీఈటీ ఫలితాలు విడుదల

వార్త 1 week ago

TG PGECET Results 2026: తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) నిర్వహించిన టీజీ పీజీఈసీఈటీ (TG PGECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎమ్ఆర్క్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించారు.

Read Also:TS Inter Supplementary Results 2026: TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026.. విడుదల లైవ్ అప్‌డేట్స్ ఇవే!

TG PGECET Results 2026: ర్యాంక్ కార్డ్స్ విడుదల

మే 29 నుండి జూన్ 1 వరకు ఆన్‌లైన్ విధానంలో (Computer Based Test) జరిగిన ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను, విద్యార్థుల మార్కులు మరియు సబ్జెక్టుల వారీగా సాధించిన ర్యాంకులతో కూడిన ర్యాంక్ కార్డ్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ను సందర్శించి ఫలితాలను పొందవచ్చు. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ‘TG PGECET 2026 Rank Card’ లింక్‌పై క్లిక్ చేసి.. విద్యార్థి హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయడం ద్వారా తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తదుపరి అడుగు – కౌన్సిలింగ్ ప్రక్రియ

టీజీ పీజీఈసీఈటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ మూడో వారం లేదా చివరి వారం నుండి ప్రారంభం కాబోయే వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. గేట్ (GATE) మరియు జీపాట్ (GPAT) అర్హత సాధించిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత.. మిగిలిపోయిన ఖాళీ సీట్లను ఈ పీజీఈసీఈటీ (TG PGECET) ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను త్వరలోనే విడిగా ప్రకటిస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha